WD&CW: మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో రిక్రూట్‌మెంట్‌..! 6 d ago

featured-image

జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ గుంటూరులోని మిష‌న్ శ‌క్తి స్కీమ్ క్రింద వ‌న్ స్టాప్ సెంట‌ర్‌లో సెంట్ర‌ల్‌ అడ్మినిస్ట్రేట‌ర్‌-1, కేస్ వ‌ర్క‌ర్‌-1, పారా లీగ‌ల్ ప‌ర్స‌న‌ల్‌/లాయ‌ర్‌-1, పారా మెడిక‌ల్ ప‌ర్స‌న‌ల్‌-1, సోష‌ల్ కౌన్సిల‌ర్‌-2, ఆఫీస్ అసిస్టెంట్ -1, మ‌ల్టీ ప‌ర్ప‌స్ స్టాఫ్‌-3, సెక్యూరిటీ గార్డ్‌-3 మొత్తం 14 పోస్టుల‌కు కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో మ‌హిళా అభ్య‌ర్ధుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుచున్నారు. విద్యార్హ‌త పోస్టును అనుస‌రించి టెన్త్‌/ఇంట‌ర్‌/డిగ్రీ తో పాటు ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి. వ‌య‌సు 18 నుంచి 42 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి. ఎంపిక ప్ర‌క్రియ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్ధులు పూర్తిచేసిన ద‌ర‌ఖాస్తుల‌ను మార్చి 5వ తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ , స్వ‌శ‌క్తి భ‌వ‌న్‌, క‌లెక్ట‌ర్ బంగ్లా రోడ్‌, గుంటూరులో స‌బ్మిట్ చేయాలి. పూర్తివివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD